తమిళ ఉగాదిని మార్చొద్దు: Shashikala

ABN , First Publish Date - 2021-12-04T16:52:41+05:30 IST

వందలాది సంవత్సరాలుగా చిత్తిరై మాసం ప్రారంభం రోజే పాటిస్తున్న తమిళ సంవత్సరాదిని మార్చరాదని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

తమిళ ఉగాదిని మార్చొద్దు: Shashikala

ప్యారీస్‌(చెన్నై): వందలాది సంవత్సరాలుగా చిత్తిరై మాసం ప్రారంభం రోజే పాటిస్తున్న తమిళ సంవత్సరాదిని మార్చరాదని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2022వ సంవత్సరం రాష్ట్రప్రభుత్వం తరఫున కుటుంబ కార్డుదారులకు పంపిణీ చేయనున్న సంక్రాంతి కానుక సంచులపై ‘తమిళ్‌ పుత్తాండు మట్రుమ్‌ పొంగల్‌ నాళ్‌ వాళ్తుగళ్‌’ అని ముద్రించడం వివాదా స్పదమైంది. దీనిపై ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో, వీకే శశికళ శుక్రవారం పండుగల విషయంలో ప్రభుత్వం జోక్యం తగదని, ప్రజలు వ్యతిరేకించే ప్రకటనల కోసం విలువైన సమయాన్ని వృధా చేయవద్దని, ప్రస్తుతం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఆదుకోవాలని ఆమె తన ప్రకటన ద్వారా డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-04T16:52:41+05:30 IST