Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 25 Mar 2022 10:40:58 IST

31 నుంచి ఐదు జిల్లాల్లో శశికళ పర్యటన

twitter-iconwatsapp-iconfb-icon
31 నుంచి ఐదు జిల్లాల్లో శశికళ పర్యటన

ప్యారీస్‌(చెన్నై): అన్నాడీఎంకే బహిష్కృతనేత వీకే శశికళ ఈ నెల 31 నుంచి సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, కోయంబత్తూర్‌, కృష్ణగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అన్నాడీఎంకే నుంచి తొలగించబడిన నిర్వాహకులతో ఇదివరకే ఆమె  చెంగల్పట్టు, విల్లుపురం, తిరుచ్చి, తంజావూ రు తదితర జిల్లాల్లో పర్యటించారు. ఆమె ఆ జిల్లాల్లో ప్రసిద్ధిచెందిన ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నారు. తదుపరి విడతగా ఐదు జిల్లాల పర్యటనను ఈ నెల 31న కృష్ణగిరిలో ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 1న నామక్కల్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, ఈరోడ్‌ జిల్లాలోని బన్నారి అమ్మవారి ఆలయాలను సందర్శించి కోయంబత్తూర్‌ వెళతారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.