హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త సారథి శశిధర్ జగదీశన్

ABN , First Publish Date - 2020-08-05T06:29:07+05:30 IST

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త సీఈఓ, ఎండీగా శశిధర్‌ జగదీశన్‌ నియమితులయ్యారు. బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో శశిగా అందరికీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త సారథి శశిధర్ జగదీశన్

  • ఆదిత్య పురి స్థానంలో నియామకం 
  • అక్టోబరు 27 నుంచి బాధ్యతలు

ముంబై: దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త సీఈఓ, ఎండీగా శశిధర్‌ జగదీశన్‌ నియమితులయ్యారు. బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో శశిగా అందరికీ ఆయన సుపరిచితులు. ప్రస్తుత సారథి ఆదిత్య పురి స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబరు 27 నుంచి మూడేళ్ల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా శశి నియామకానికి ఆర్‌బీఐ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం నాడు బ్యాంక్‌ ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. 54 ఏళ్ల శశి ప్రస్తుతం బ్యాంక్‌ స్ట్రాటజిక్‌ చేంజ్‌ ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు.. 


  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను ప్రారంభించి 25 ఏళ్లకు పైగా అయింది. ఆదిత్య పురి బ్యాంక్‌ వ్యవస్థాపక సారఽథి. అంటే, బ్యాంక్‌ పగ్గాలు తొలిసారిగా చేతులు మారబోతున్నాయి 

  • రెండేళ్లుగా పురి వారసుడి కోసం బ్యాంక్‌ అన్వేషిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న బ్యాంకింగ్‌ వర్గాల ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది

  • ఆదిత్య పురి సారథ్యంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ బ్యాంక్‌గా ఎదిగింది. బ్యాంక్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.5.71 లక్షల కోట్ల పైమాటే. మొండి బకాయులను సమర్థవంతంగా నియంత్రించగలగడంతో పాటు లాభాల్లో వృద్ధిని నిలకడగా కొనసాగించడం ఇందుకు దోహదపడింది 

  • హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా ఆదిత్య పురి పదవీకాలం ఈ అక్టోబరు 26తో ముగియనుంది. ఆ మరుసటి రోజు శశి బాధ్యతలు చేపడతారు. 


1996లో బ్యాంక్‌లోకి శశి ఎంట్రీ 

కొన్నాళ్లు దాయిష్‌ బ్యాంక్‌లో పనిచేసిన శశి.. 1996లో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ మేనేజర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999లో బ్యాంక్‌ ఫైనాన్స్‌ విభాగ బిజినెస్‌ హెడ్‌గా పదోన్నతి పొందారు. 2008లో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ)గా ఎదిగారు. ఆ తర్వాత చేంజ్‌ ఏజెంట్‌గా నియమితులయ్యారు. అంతేకాదు, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, లీగల్‌, సెక్రటేరియల్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఇన్‌ఫ్రా, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, సీఎ్‌సఆర్‌ విభాగాలకూ ఆయనే అధిపతి. గడిచిన కొన్నేళ్లలో తాము నిర్దేశించుకున్న వ్యూహాత్మక లక్ష్యాలను ముం దుకు తీసుకెళ్లడంతో పాటు నిలకడగా వృద్ధి సాధనలో శశి కీలకపాత్ర పోషించారని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ పేర్కొంది. 


4 శాతం పెరిగిన షేరు  

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త సారథి నియామకంపై మార్కెట్‌ వర్గాలు అత్యంత సానుకూలంగా స్పందించాయి. దీంతో బ్యాంక్‌  షేరు ఏకంగా 3.94 శాతం లాభపడి రూ.1,041.40 వద్ద స్థిరపడింది. 



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గురించి.. 

20%: గత కొన్నేళ్లుగా వృద్ధి రేటు  

రూ. 15.45 లక్షల కోట్లు: జూన్‌ నాటికి బ్యాలెన్స్‌ షీటు 

రూ.10 లక్షల కోట్లు: బ్యాంక్‌ మంజూరు చేసిన రుణాలు 

Updated Date - 2020-08-05T06:29:07+05:30 IST