Shashi Tharoor: హైదరబాద్‌లో కొందర్ని సపరేట్, సపరేట్‌గా కలవబోతున్నా..

ABN , First Publish Date - 2022-10-03T18:32:00+05:30 IST

పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై శశిథరూర్ మేనిఫెస్టో తయారు చేశారు.

Shashi Tharoor: హైదరబాద్‌లో కొందర్ని సపరేట్, సపరేట్‌గా కలవబోతున్నా..

ఢిల్లీ (Delhi): పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ (Shashi Tharoor) మేనిఫెస్టో  తయారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవన్నారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. హైదరబాద్‌లో కొందరిని సపరేట్.. సపరేట్‌గా కలవబోతున్నానన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే స్టాండ్ అని శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తి మంతులు అనేదే ప్రధాన ప్రశ్న అన్నారు. తాను ఇటీవలే ఖర్గేతో మాట్లాడానని, ఆయన ఒక గొప్ప నేతని, ఆయనతో తనకు మంచి  సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్‌కి గాంధీ ఫ్యామిలీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని, కాంగ్రెస్‌లో జీ 23 అనేదే లేదని శశిథరూర్ వ్యాఖ్యానించారు.


తన విజన్ తనకుందని, ఖర్గే విజన్ ఆయనకుందని శశిథరూర్ అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని, కానీ వెళ్ళలేకపోయానన్నారు. రేవంత్ పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్‌కు వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-03T18:32:00+05:30 IST