శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' థియేటర్స్‌లోనే..!

టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అమల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందట. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టి చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో శర్వానంద్ నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి. దాంతో కాస్త ఆయన మార్కెట్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా నిర్మాతలు ఓటీటీవైపు మొగ్గుచూపుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని, 'ఒకే ఒక జీవితం' మూవీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి థియేటర్స్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి ఈ విషయంలో కన్‌ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలున్నాయట. ఇక ఇందులో శర్వానంద్ సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, డ్రీమ్ వారియర్స్ బ్యానర్‌పై ప్రభు ఎస్ ఆర్ నిర్మిస్తున్నారు.   

Advertisement
Advertisement