Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 18:45:30 IST

Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ లిరికల్‌ సాంగ్‌!

twitter-iconwatsapp-iconfb-icon

శర్వానంద్‌ (Sharwanand)హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’(Oke oka jeevitham). ఈ చిత్రంతో శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెడుతోంది. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాతలు. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఒకటే కదా’ లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు. కథానాయకుడి జీవితం, సోల్‌మేట్‌ సెర్చింగ్‌ నేపథ్యంలో సాగే పాట ఇది. జేక్స్‌ బిజోయ్‌ యూత్‌ఫుల్‌, ట్రెండీ ట్యూన్‌ ఇచ్చారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా గౌతమ్‌ భరద్వాజ్‌ ఆలపించారు. శర్వానంద్‌, రీతూ వర్మ(Rithu varma ), అమల అక్కినేని(Amala akkineni), వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్‌ సారంగ్‌ కెమెరామెన్‌గా, శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు అందిస్తున్నారు. ‘కణం’ పేరుతో  తమిళంలో విడుదల చేయనున్నారు. 


Sharwanand: ఒకే ఒక జీవితం లిరికల్‌ సాంగ్‌!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement