షారుఖ్‌ ‘లవ్‌ హాస్టల్‌’

ABN , First Publish Date - 2022-01-30T05:30:00+05:30 IST

అటు నటన, ఇటు చిత్ర నిర్మాణం.. షారుఖ్‌ ఖాన్‌ రెండు పడవల ప్రయాణం సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘బాబ్‌ బిస్వాస్‌’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ కోసం ఓ చిత్రాన్ని నిర్మించింది....

షారుఖ్‌ ‘లవ్‌ హాస్టల్‌’

అటు నటన, ఇటు చిత్ర నిర్మాణం.. షారుఖ్‌ ఖాన్‌ రెండు పడవల ప్రయాణం సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆయన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘బాబ్‌ బిస్వాస్‌’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ కోసం ఓ చిత్రాన్ని నిర్మించింది. అభిషేక్‌ బచ్చన్‌, చిత్రాంగదా సింగ్‌ తదితరులు నటించిన ఈ థ్రిల్లర్‌కు దివ్య అనుపమ ఘోష్‌ దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు ‘లవ్‌ హాస్టల్‌’ పేరుతో మరో చిత్రాన్ని నిర్మించారు  షారుఖ్‌ ఖాన్‌. ఇది కూడా థ్రిల్లర్‌ కావడం విశేషం. 

‘లవ్‌ హాస్టల్‌’ ను మొదట థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని జీ 5 ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 18న స్ట్రీమింగ్‌ అయ్యే ఈ చిత్రం ట్రైలర్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. 

విక్రాంత్‌ మాస్సీ , బాబీ డియోల్‌, శాన్య మల్హొత్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి శంకర్‌ రామన్‌ దర్శకుడు. 

Updated Date - 2022-01-30T05:30:00+05:30 IST