Jun 26 2021 @ 09:50AM

'పఠాన్' షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో రీస్టార్ట్ అయ్యింది. 15 నుంచి 18 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుండగా, షారుఖ్ ఖాన్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తరలో హీరోయిన్ దీపికా పదుకొణ్, మరో నటుడు జాన్ అబ్రహం కూడా జాయిన్ కానున్నారట. ఈ షెడ్యూల్‌తో మేజర్ టాకీ పార్ట్ పూర్తవనుందని సమాచారం. ఇక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్ర బృందంవిదేశాలకు వెళ్లనుంది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత షారుఖ్ నటిస్తున్న 'పఠాన్' మీద భారీ అంచనాలున్నాయి. కాగా ఈ స్టార్ హీరో నటించిన 'జీరో' 2018లో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్‌ను అందుకోలేకపోయింది.

Bollywoodమరిన్ని...