ముంబై నుంచి దుబాయి వరకు.. Aryan Khan తండ్రి షారూఖ్ ఆస్తుల లెక్కలివీ..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ప్రవేశించి బడా హీరోగా ఎదిగాడు షారూక్ ఖాన్. స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత నిర్మాతగా, వ్యాపారవేత్తగా, బ్రాండ్ అంబాసిడర్‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. లేక్కలేనన్ని ఆస్తలు సంపాదించాడు. షారూక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. షారూక్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం ఇప్పడు హాట్ టాపిక్‌ అయిపోతోంది. ఈ నేపథ్యంలో షారూక్ ఆస్తుల లెక్కల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 

ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో షారూక్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. `మన్నత్`గా వ్యవహరించే ఆ ఇంటిని షారూక్ కొన్ని సంవత్సరాల కిందట రూ.13 కోట్లకు కొన్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ దాదాపు రూ.200 కోట్లు. షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ ఢిల్లీకి చెందిన వారనే సంగతి తెలిసిందే. ఆ నగరంలోనే వారి ప్రేమ చిగురించింది. అందుకే ఢిల్లీలో కొన్నేళ్ల కిందట షారూక్ దంపతులు ఓ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. షారూక్ కుటుంబం ఢిల్లీ వెళ్లినపుడు అక్కడే బస చేస్తుంటుంది. 

దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన షారూక్ ఖాన్‌కు దుబాయ్ గోల్డెన్ వీసా ఉంది. అక్కడి ఖరీదైన పామ్ జుమెరయ్‌లో విలాసవంతమైన విల్లా ఉంది. దానికి షారూక్ `జన్నత్`గా నామకరణం చేశాడు. 8500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ విల్లా ఖరీదు రూ.18 కోట్లు. 

ముంబైకి సమీపంలో ఉన్న అలీ బాగ్‌లో షారూక్‌కు మరో విల్లా ఉంది. ఈ భారీ విల్లాలోనే షారూక్ తన జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటుంటాడు. 20000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాను గౌరీ తన అభిరుచికి అనుగుణంగా నిర్మించుకుంది. ఇవి మాత్రమే కాకుండా షారూక్‌కు ఎన్నో ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో కూడా షారూక్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. 

Advertisement