UK Visa: యూకే వీసాలు భారతీయులకే అధికం

ABN , First Publish Date - 2022-08-26T13:05:55+05:30 IST

వీసాల మంజూరులో యునైటెడ్‌ కింగ్‌డం (యూకే) భారతీయులకు అధిక ప్రాధాన్యమిస్తోంది.

UK Visa: యూకే వీసాలు భారతీయులకే అధికం

విద్యార్థుల కోటాలో 89% వృద్ధి.. బ్రిటిష్‌ హైకమిషన్‌ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వీసాల మంజూరులో యునైటెడ్‌ కింగ్‌డం (యూకే) భారతీయులకు అధిక ప్రాధాన్యమిస్తోంది. గత జూన్‌నాటికి సంవత్సర కాలంలో 1,18,000 మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్‌ వీసా పొందారు. మునుపటి సంవత్సరంతో పోల్చితే ఇది 89శాతం అధికం. ఈ విషయంలో చైనాను భారత్‌ అధిగమించిందని గురువారం ఢిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ కార్యాలయం తెలిపింది. పర్యాటకుల వీసాలు కూడా అధికమే. మొత్తం 2,58,000 మంది భారతీయులు ఈ వీసాలు పొందారు. బ్రిటన్‌ జారీ చేసిన మొత్తం పర్యాటకుల వీసాల్లో భారతీయులది 28ు వాటా. 2021తో పోల్చితే భారతీయులకు పర్యాటకుల వీసాలు మంజూరులో 630% పెరుగుదల కనిపించింది. ఆ ఏడాది కరోనా కారణంగా వీసాలను నిలిపివేయడమే ఈ భారీ వృద్ధికి కారణం. 1,03,000 భారతీయులు వర్క్‌ వీసాలు పొందారు. ఈ విభాగంలో వృద్ధి 148%గా ఉంది.

Updated Date - 2022-08-26T13:05:55+05:30 IST