Sharmila: Trs పార్టీ కాస్త BRS అయ్యిందా..?

ABN , First Publish Date - 2022-05-03T01:46:39+05:30 IST

Trs పార్టీ కాస్త BRS అయ్యిందని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు..BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని, ..

Sharmila: Trs పార్టీ కాస్త  BRS అయ్యిందా..?

భద్రాద్రి కొత్తగూడెం : Trs పార్టీ కాస్త  BRS అయ్యిందని cm kcr గొప్పలు చెప్పుకుంటున్నారు..BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని... ప్రజలంతా నవ్విపోతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. సోమవారం దమ్మపేట బహిరంగ సభలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె సభలో మాట్లాడుతూ.. ‘‘టీఆర్.ఎస్ పార్టీ కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందట..!కేసీఆర్ సిగ్గులేకుండా ఒక Plenary పెట్టారు.మొదటి తీర్మానం వడ్లు కొంటాం.కేసీఆర్‌కి సిగ్గు ఉండాలి... బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి ..ఇవ్వబోమని సంతకం పెట్టింది KCR కాదా.ఇందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం.సిగ్గులేకుండా ముఖ్యమంత్రిగా ఉండి వరి వేసుకుంటే ఉరే అని చెప్పినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం..మెడలు వంచుతాం... పోరాటం చేస్తాం... అని ఢిల్లీలో పెద్ద రాగం తీసి గంట సేపు కూడా లేకుండా వచ్చినందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం.కేసీఆర్ చెప్పిన మాటకి 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదు... ఇందుకు పెట్టుకోవాల్సింది అభినందన తీర్మానం.8 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకు పెట్టాల్సింది అభినందన తీర్మానం’’ అని వైఎస్ షర్మిల దెప్పిపొడిశారు.

Read more