చిన్నారి ఇంటి దగ్గర షర్మిల దీక్ష

ABN , First Publish Date - 2021-09-15T21:20:02+05:30 IST

చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు.

చిన్నారి ఇంటి దగ్గర షర్మిల దీక్ష

హైదరాబాద్‌: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. సీఎం స్పందించే వరకు సింగరేణి కాలనీలోని బాధితుల ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటిస్తూ.. దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా చేసిన కేసీఆర్ ఘటన జరిగి ఆరు రోజులయినా బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల కోసమా? లేక కేసీఆర్, కేటీఆర్ కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలకు సరైనా సమాచారం ఇవ్వలేని వ్యక్తి మనకు మంత్రి అయ్యారని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో లైంగింక వేధింపుల కేసులు మూడు రెట్లు పెరిగాయని ఆరోపించారు.


తక్షణమే హంతకుడిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తారా? లేక ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. అందరికీ బుద్ది వచ్చేలా.. అమ్మాయి మీద చేయిపడితే చేతులు విరిగిపోతాయి.. మెడ తెగిపోతుందన్న భయం కలిగించకపోతే ఈ దారుణాలు ఆగవని అన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేస్తారో సమాధానం చెప్పేంతవరకు తాను బాధితుల ఇంటిముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-15T21:20:02+05:30 IST