మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు

ABN , First Publish Date - 2022-03-06T18:41:56+05:30 IST

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే మంచి పథకాలు చూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు వేశారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదని రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని రాజీనామా చేస్తారా?.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా?..  ‘‘మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా?.. మీరు బాగుండాలి..రాష్ట్రం మాత్రం రావణకాష్టం కావాలి.. అంతే కదా.. మీ అద్భుత పాలన?’’ అంటూ వైఎస్‌ షర్మిల సెటైర్లు వేశారు.

Updated Date - 2022-03-06T18:41:56+05:30 IST