నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టుంది కేసీఆర్ తీరు: షర్మిల

ABN , First Publish Date - 2022-01-04T19:47:16+05:30 IST

‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టు ఉంది కేసీఆర్ తీరు’ అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టుంది కేసీఆర్ తీరు: షర్మిల

అమరావతి : ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టు ఉంది కేసీఆర్ తీరు’ అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. రైతులను బ్యాంకర్ల దృష్టిలో దొంగల్ని చేశారన్నారు. ‘‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టు ఉంది కేసీఆర్ తీరు. సర్కార్ రుణమాఫీ చేస్తుందని కేసీఆర్ గారిని నమ్మి గెలిపించారు. రైతులను బ్యాంకర్ల దృష్టిలో దొంగల్ని చేశారు. రుణం ఎగ్గొట్టే ఎగవేతదారులుగా చేశారు. చేసిన అప్పులకు వడ్డీ మీద వడ్డీ కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దొరగారికి రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీ మాత్రం గుర్తుకు రాదు. లక్ష లోపు రుణమాఫీ అని చెప్పి మూడేళ్లు అయ్యింది. ఇప్పటి వరకూ మాఫీ చేసింది మూడు శాతం కూడా లేదు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి న చేతకాని ముఖ్యమంత్రి మనకు వద్దు’’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2022-01-04T19:47:16+05:30 IST