పాదచారులకు Sharjah పోలీసుల హెచ్చరిక!

ABN , First Publish Date - 2022-07-02T15:18:47+05:30 IST

రోడ్లపైకి వచ్చే పాదచారులకు షార్జా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

పాదచారులకు Sharjah పోలీసుల హెచ్చరిక!

షార్జా: రోడ్లపైకి వచ్చే పాదచారులకు షార్జా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్లమీద అస్తవ్యస్తంగా నడవడం చేయకూడదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై సాహసాలు చేస్తూ నడవడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటివి చేయకూడదని సూచించారు. ఫెడలర్ ట్రాఫిక్ లా ప్రకారం ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్, క్రాస్ రోడ్స్ నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తారో వారికి 400 దిర్హమ్స్(రూ.8,597) జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్, పెట్రోలింగ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ మేజర్ అబ్దుల్లా సలీం అల్ మంధారీ వెల్లడించారు.


నివాసితులు, పౌరులకు ట్రాఫిక్ చట్టాల మీద పూర్తి అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ విభాగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు, ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం అరబిక్‌తో పాటు ఇంగ్లీష్, ఉర్ధూ భాషలలో అందుబాటులో ఉందన్నారు. ఈ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు చాలా సులువుగా చేరుతుందని అధికారులకు అల్-మంధారీ ఆదేశించారు. పాదాచారుల భద్రతే లక్ష్యంగా త్వరలో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.   

Updated Date - 2022-07-02T15:18:47+05:30 IST