Eid al-Adha: అక్కడ బంపరాఫర్.. అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులపై 80శాతం డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-07-08T16:27:33+05:30 IST

ఈద్ అల్-అధా (Eid al-Adha)ను పురస్కరించుకుని మూడు రోజుల పాటు అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల మీద షార్జా దుకాణ సముదాయం భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.

Eid al-Adha: అక్కడ బంపరాఫర్.. అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులపై 80శాతం డిస్కౌంట్

షార్జా: ఈద్ అల్-అధా (Eid al-Adha)ను పురస్కరించుకుని మూడు రోజుల పాటు అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల మీద షార్జా దుకాణ సముదాయం భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. జూలై 6, 7, 8వ తేదీల్లో ఈ భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని షార్జా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCCI) వెల్లడించింది. ఈ మూడు రోజుల పాటు అన్ని బ్రాండ్స్‌కు చెందిన వివిధ రకాల వస్తువుల మీద సుమారు 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని పేర్కొంది. 'షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022'లో భాగంగా SCCI ఈ భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 


ఈ సందర్భంగా షార్జా సమ్మర్ ప్రమోషన్స్ సమన్వయ కర్త, SCCI మార్కెటింగ్ మరియు ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఇబ్రహీం రషీద్ అల్ జర్వాన్ మాట్లాడుతూ విజిటర్స్, నగర పౌరులు, నివాసితులను విశేషంగా ఆకర్షించేందుకు, అమ్మకాలను పెంచుకునేందుకు ఈ మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ప్రమోషన్స్ పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ పర్సన్ హనా అల్ సువైది మాట్లాడుతూ ఈ భారీ డిస్కౌంట్ల ప్రచారంలో భాగంగా వివిధ వర్గాల పౌరుల ఆసక్తిని బట్టి అత్యధిక విలువైన బహుమతులను వారు గెలుచుకునేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.     

Updated Date - 2022-07-08T16:27:33+05:30 IST