లాక్‌డౌన్ తర్వాత.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి క్రికెటర్..

ABN , First Publish Date - 2020-05-24T00:39:01+05:30 IST

కరోనా వైరస్ కారణంగా రెండు నెలల పాటు విధించిన లాక్‌డౌన్ తర్వాత ఇండియాలో బహిరంగంగా క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి ఆటగాడిగా శార్ధూల్ ఠాకూర్ నిలిచాడు.

లాక్‌డౌన్ తర్వాత.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి క్రికెటర్..

కరోనా వైరస్ కారణంగా రెండు నెలల పాటు విధించిన లాక్‌డౌన్ తర్వాత ఇండియాలో బహిరంగంగా క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి ఆటగాడిగా శార్ధూల్ ఠాకూర్ నిలిచాడు. భారత్ తరఫున ఒక టెస్టు, 11 వన్డేలు, 15 టీ-20లు ఆడిన అతను మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని బయోసర్‌లోని గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. రెండు నెలల తర్వాత ఈరోజు ప్రాక్టీస్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అతను తెలిపాడు. అన్ని జాగ్రత్తలతోనే ఈ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించామని సంబంధిత అధికారి వెల్లడించారు. బౌలర్లు వాళ్ల సొంత బంతులు తెచ్చుకున్నారని.. వాటిని శుభ్రం చేసిన తర్వాతే ఉపయోగించామని పేర్కొన్నారు. ఆటగాళ్లతో పాటు ప్రాక్టీస్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రాక్టీస్‌కు అనుమతించామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-24T00:39:01+05:30 IST