Abn logo
Oct 28 2020 @ 10:24AM

`మన్నత్`ను అమ్మేస్తున్నారా.. నెటిజన్ ప్రశ్నకు షారుఖ్‌ అద్భుత రిప్లై!

Kaakateeya

ముంబైలోని అరేబియా మహా సముద్రం ఎదురుగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌కు ఉన్న అత్యంత విలాసవంతమైన భవనం `మన్నత్`. ఈ భవనం అంటే షారూక్‌కు ఎంతో ఇష్టం. తాజాగా `ఆస్క్‌ ఎస్‌ఆర్‌కే` పేరిట షారూక్ అభిమానులతో ముచ్చటించారు. 


ఈ సందర్భంగా ఓ నెటిజన్ `భాయ్.. మన్నత్‌ను అమ్మేస్తున్నారా?` అని ప్రశ్నించాడు. దీనికి షారూక్ అత్యంత సమయస్ఫూర్తితో జవాబిచ్చాడు. `బ్రదర్.. మన్నత్‌ను ఎవరూ అమ్మలేరు. ఏదైనా పొందాలంటే వినమ్రంగా తల వంచుకుని అడగాలి. ఆ విషయం గుర్తుంచుకుంటే జీవితంలో ఎంతో కొంత సాధించగలవ`ని రిప్లై ఇచ్చారు. `మన్నత్` అనే పదానికి `ప్రార్థన`అనే అర్థం కూడా ఉంది. ఈ అర్థంలో షారూక్ రిప్లై ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. 


Advertisement
Advertisement