TS news: రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-04T14:23:54+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

TS news: రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజైన నేడు మహాలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం చేశారు. రేపు  ఉత్సవాల్లో చివరి రోజున విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు. సీతారాముల పట్టాభిషేకం, దసరా మండపం వద్ధ విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీ రామ లీలా మహోత్సవం వేడుకలు జరుగనున్నాయి. 

Updated Date - 2022-10-04T14:23:54+05:30 IST