ఉధృతంగా శారదా నది

ABN , First Publish Date - 2022-08-09T06:59:21+05:30 IST

రైవాడ నీటిని దిగువకు విడుదల చేయడంతో శారదా నదిలో ప్రవాహ ఉధృతి పెరిగింది.

ఉధృతంగా శారదా నది
శారదానదిపై గవరవరం కాజ్‌వేకు గండిపడిన దృశ్యం


గవరవరం కాజ్‌వేకు గండి

చోడవరం, ఆగస్టు 8: రైవాడ నీటిని దిగువకు విడుదల చేయడంతో శారదా నదిలో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో సోమవారం సాయంత్రం గవరవరం కాజ్‌వేకు గండి పడింది.మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో శారదా నదిలో ప్రవాహ ఉధృతి బాగా పెరిగింది. దీంతో గవరవరం వద్ద గతంలో ఏర్పాటు చేసిన కాజ్‌వేకు మధ్యలో గండి పడింది. పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి గవరవరం వద్ద శాశ్వత వంతెన దాదాపుగా పూర్తికావచ్చింది. ఇంకా అప్రోచ్‌ పనులు సాగుతుండడంతో వంతెనను ప్రారంభించకపోయినా పైనుంచి ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి శారదానదిలో ప్రవాహం ఉధృతి మరింత పెరిగితే కాజ్‌వే మరింత కొట్టుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 


Updated Date - 2022-08-09T06:59:21+05:30 IST