కేంద్ర ప్రభుత్వంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-06T13:23:45+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వంపై...

కేంద్ర ప్రభుత్వంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

పూణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతోనే రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు మరింతగా క్షీణిస్తున్నాయని ఆరోపించారు. 


పూణె జిల్లాలోని జున్నార్‌లో జరిగిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ తాను యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నానని, అప్పట్లో రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేవన్నారు. ప్రస్తుతం రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, వ్యయసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలు మరింత దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే... రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వాటిని నేలపాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 

Updated Date - 2021-09-06T13:23:45+05:30 IST