కెనడియన్ టెన్నిస్ స్టార్ షపోవాలోవ్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-23T00:02:52+05:30 IST

కెనడియన్ టెన్సిస్ స్టార్, ప్రపంచ నంబరు 12 ఆటగాడు డెనిస్ షపోవాలోప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు

కెనడియన్ టెన్నిస్ స్టార్ షపోవాలోవ్ సంచలన నిర్ణయం

ఒట్టావా: కెనడియన్ టెన్సిస్ స్టార్, ప్రపంచ నంబరు 12 ఆటగాడు డెనిస్ షపోవాలోవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. స్పానిష్ దిగ్గజం రఫెల్ నాదల్, ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్‌ కూడా తాము ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని గతవారం ప్రకటించారు. కాగా, 22 ఏళ్ల షపోవాలోవ్ ఇటీవల భుజం గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. 


కెనడాకు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణమని, అయితే ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరి క్షేమాన్ని కాంక్షించి తాను, తన బృందం ఒలింపిక్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు షపోవాలోవ్ పేర్కొన్నాడు. భవిష్యత్ ఒలింపిక్స్‌లలో మాత్రం కెనడాకు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-06-23T00:02:52+05:30 IST