షాపూర్జీ పల్లోంజీ... గ్రేట్ బిల్డర్ సాధారణ స్థాయి నుంచి... ప్రపంచస్థాయికి

ABN , First Publish Date - 2022-06-29T01:07:09+05:30 IST

భారత్‌లోని అత్యంత ఎత్తైన భవనం ముంబైలోని ఇంపీరియల్ రెసిడెన్షియల్ టవర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాజ్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలివి. ఇవన్నీ కూడా... దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఐకానిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక భాగం.

షాపూర్జీ పల్లోంజీ... గ్రేట్ బిల్డర్  సాధారణ స్థాయి నుంచి... ప్రపంచస్థాయికి

ముంబై : భారత్‌లోని అత్యంత ఎత్తైన భవనం ముంబైలోని ఇంపీరియల్ రెసిడెన్షియల్ టవర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాజ్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలివి. ఇవన్నీ కూడా... దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఐకానిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక భాగం. అంతేకాకుండా... ఇవన్నీ కూడా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ సంస్థలలో ఒకటైన ‘షాపూర్జీ పల్లోంజీ గ్రూప్’ ఆధ్వర్యంలో నిర్మితమైనవే కాడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ ఇది. ఈ గ్రూప్‌లోని దీని ప్రధాన కంపెనీలు ఆఫ్కాన్స్, యురేకా ఫోర్బ్స్, SPCL, SP ఇంటర్నేషనల్, స్టెర్లింగ్ & విల్సన్, SP రియల్ ఎస్టేట్. తొంభై మూడేళ్ళ వయస్సులో... ఈ రోజు28 జూన్, 2022 మంగళవారం) తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచిన పల్లోంజీ నిర్వహించిన వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌గా పేరుతెచ్చుకుంది. ఆయన భార్య ప్యాట్సీ, కుమార్తెలు లైలా రుస్తోం జహంగీర్, అలూ నోయల్ టాటా, కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ. 


కాగా... 1865లో లిటిల్‌వుడ్ పల్లోంజీ అనే చిన్న భాగస్వామ్య సంస్థ పునాదితో ‘పల్లోంజీ మిస్త్రీ యాత్ర’ ప్రారంభమైంది. గిర్గామ్ చౌపటీపై పేవ్‌మెంట్ నిర్మాణం పల్లోంజీ మొదటి ప్రాజెక్ట్. ఈ మైనర్ కాంట్రాక్ట్ ఆరు నెలల పాటు కంపెనీని లాభాల్లో నడిపింది. తర్వాత... 1881లో మలబార్ హిల్‌పై రిజర్వాయర్‌ను నిర్మించే ప్రాజెక్ట్. మలబార్ హిల్ రిజర్వాయర్ ముంబై నగరానికి 100 సంవత్సరాలకు పైగా నీటిని సరఫరా చేయడానికి బాధ్యత వహించే ఘననిర్మాణం. 


ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా 1930లో దాదాపు రూ. 1.5 కోట్ల వ్యయంతో పల్లోంజీ గ్రూపే నిర్మించింది. రికార్డు స్థాయిలో 21 నెలల వ్యవధిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కంపెనీని అప్పటి బొంబాయి గవర్నర్ ప్రశంసించారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యవస్థాపకుడు షాపూర్జీ మిస్త్రీకి 1929లో జన్మించిన ఆయన కుమారుడు పల్లోంజీ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు ఆ తర్వాతి కాలంలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం... పల్లోంజీ మిస్త్రీ కుమారుడు షాపూర్ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(SPCPL) ఛైర్మన్‌గా ఉన్నారు. షాపూర్ పల్లోంజీ మిస్త్రీ కుమారుడు పల్లోన్ మిస్త్రీ కూడా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో చేరారు. ఆయన సోదరి తాన్య గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 


ఈ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. షాపూర్జీ మిస్త్రీ సీనియర్, మెహెర్వాన్ దరువాలా భాగస్వామ్యంతో స్టెర్లింగ్, విల్సన్‌లు ఏర్పాటయ్యాయి, ఇది EPC రంగంలో గ్లోబల్ లీడర్. అంతేకాకుండా... ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రంగాల్లో అత్యంత విశ్వసనీయ సంస్థల్లో ఒకటి. పల్లోంజీ గ్రూప్ మరో 13 కంపెనీలు, మూడు విభాగాలను నిర్వహిస్తోంది. మొత్తం 60కి పైగా దేశాలలో 60 వేల మందికి పైగా ఖాతాదారులకు సేవలందిస్తున్న బలమైన వ్యవస్థ పల్లోంజీ గ్రూప్. 


 

Updated Date - 2022-06-29T01:07:09+05:30 IST