భానుప్రియ చెల్లెలు రీ‌ఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ నటీమణి భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ గుర్తుందా? తెలుగులో ‘మహర్షి’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.  అంతకు ముందే తమిళంలో నిషాంతి పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆమె. అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆపై  ‘సౌగంధ్’ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆరేడు సినిమాల్లో నటించారు. 1994లో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు శాంతి ప్రియ. ఆమె నటించిన ఆఖరి సినిమా ‘ఇక్కేపే ఇక్కా’ హిందీ చిత్రం. దాదాపు 27 ఏళ్ళ తర్వాత మళ్ళీ శాంతి ప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఓ వెబ్ సిరీస్ తో. అందులోనూ బాలీవుడ్ లో. 


సునీల్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో శాంతి ప్రియ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమిత్ కక్కడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జీస్డూడియోస్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ ఎమెక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ కాబోతోంది. సోనాలీ కులకర్ణి, వివేక్ ఒబెరాయ్, ఫ్రెడ్డీ దరూవాలా, సంతోష్ జువేకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ లో శాంతిప్రియ ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ శాంతిప్రియను తిరిగి బాలీవుడ్ లో బిజీ చేస్తుందో లేదో చూడాలి. 

Advertisement

Bollywoodమరిన్ని...