Abn logo
Mar 1 2021 @ 10:32AM

కమల్‌కు గిఫ్ట్ ఇచ్చిన శ్రుతి బాయ్‌ఫ్రెండ్!

విశ్వనటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ కథానాయిక శ్రుతీహాసన్ ప్రేమాయాణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ ప్రేమ గురించి వీరిద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినప్పటికీ.. ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమలోకంలో విహరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల శాంతను చెన్నై వచ్చి శ్రుతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా కలిశాడు.

 కమల్‌కు అదిరిపోయే బహుమతి అందించాడు. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్‌లైట్ పట్టుకుని తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి అరవీర భయంకరుడిగా కమల్ వస్తున్నాడనే థీమ్‌తో స్వయంగా ఓ చిత్రాన్ని గీసి దానిని కమల్‌కు అందించాడు. ఆ చిత్రం కమల్‌కు తెగ నచ్చేసింది. దానిని కమల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన ఉద్దేశాన్ని గుర్తించినందుకు శాంతనుకు కమల్ ధన్యవాదాలు చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement