Abn logo
Oct 24 2020 @ 01:01AM

నిర్మాతకు శంకర్‌ అల్టిమేటం!

Kaakateeya

‘‘షూటింగ్‌ ప్రారంభించ ండి, లేదా నన్ను మరో సినిమా అయినా చేసుకోనివ్వండి అంటున్నార’’ట తమిళ దర్శకుడు శంకర్‌. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్‌ హీరోగా ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ తీస్తున్న విషయం తెలిసిందే. 60 శాతం షూటింగు పూర్తయింది. కరోనా వల్ల కొన్ని నెలల పాటు షూటింగ్‌కు విరామం వచ్చింది. ప్రభుత్వం అనుమతించడంతో చాలా చిత్రాల షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనా ‘ఇండియన్‌ 2’ నిర్మాతలు మాత్రం తమ సినిమా చిత్రీకరణ గురించి ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. దీంతో కమల్‌హాసన్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నటించాల్సిన చిత్రంపైన దృష్టిపెట్టారు. ఆ చిత్రం కోసం ఏవీఎమ్‌ స్టూడియోలో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. షూటింగు ప్రారంభించేదాకా ఖాళీగా కూర్చుంటే విలువైన సమయం వృధా అవుతుందని భావించిన శంకర్‌ ‘ఇండియన్‌ 2’ చిత్ర నిర్మాణ సంస్థ సీఈవోకు లేఖ రాశారట. ‘‘చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు చెప్పండి. షూటింగ్‌ ఇప్పట్లో మొదలుపెట్టే ఉద్దేశం లేకపోతే కొత్త సినిమా చేసుకోవడానికి నాకు అనుమతివ్వండి’’ అని అందులో పేర్కొన్నారట. త్వరలోనే షూటింగు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ చెప్పినట్లు సమాచారం.

Advertisement
Advertisement