Oct 25 2021 @ 14:34PM

#RC15 : డిఫరెంట్ కాన్సెప్ట్ తో చెర్రీపై సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మేకింగ్ కింగ్ శంకర్ కాంబినేషన్ లో  పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూనేలో ప్రారంభమైంది. సాంగ్ తో చిత్రీకరణ ప్రారంభించారు. రెండువారాల పాటు ఈ పాటను షూట్ చేయాలని శంకర్ ప్లాన్ చేశారు. శంకర్ సినిమాల్లో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే.. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో పాటల్ని షూట్ చేస్తారు ఆయన. ఈ సినిమాకి కూడా శంకర్.. చెర్రీ, కియారాలపై ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకోసం ప్రత్యేకించి బడ్జెట్ ను కేటాయించారట నిర్మాత దిల్ రాజు. 



సాధారణంగా తన నిర్మాణంలో రూపొందే సినిమాల బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించే దిల్ రాజు.. ఈ సినిమా విషయంలో శంకర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు.. శంకర్ గత చిత్రాల్లోని పాటల్లాగానే కలకాలం నిలిచిపోనున్నాయట. ఈ విషయంలో శంకర్ కి, తమన్ కి భలేగా వేవ్ లెంత్ కుదిరిందట. ఇక ఈ పాటకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తున్నారు.