Abn logo
Sep 26 2021 @ 00:31AM

బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జిగా శంకర్‌

బాధ్యతలు స్వీకరిస్తున్న శంకర్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25: సూర్యాపేట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జిగా కె.శంకర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉత్తర్వులమేరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న శంకర్‌ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇదేశాఖలో పని చేసిన ఉపేందర్‌పై పలు అభియోగాలు రావడంతో అతన్ని విధులనుంచి తొలగించి శంకర్‌కు బాధ్యతలు అప్పగించారు.