Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 28 Oct 2021 21:06:31 IST

ARYAN KHANకు బెయిల్ లభించగానే... తమ చిన్న నాటి ఫోటో షేర్ చేసిన కాబోయే బాలీవుడ్ హీరోయిన్!

twitter-iconwatsapp-iconfb-icon

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్. ఆయన కూతురే షానయా కపూర్. బీ-టౌన్‌లో ఈ స్టార్ కిడ్ ఆల్రెడీ చాలా ఫేమస్. అయితే, ఇంత వరకూ బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే, అనన్య పాండే, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్... వీళ్లదంతా ఓ మిలీనియల్ బ్యాచ్. ఇంకా పాతికేళ్లు కూడా నిండని వీరంతా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తల్లిదండ్రులకి వారసులు కావటంతో మీడియా అటెన్షన్ కూడా ఎక్కువ పొందుతుంటారు. ఆ క్రమంలోనే సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్‌కి చెల్లెలుగా, అర్జున్ కపూర్ కజిన్‌గా షానయా కూడా పేజ్ త్రీ వార్తల్లో దుమ్ము రేపుతుంటుంది. 

ARYAN KHANకు బెయిల్ లభించగానే... తమ చిన్న నాటి ఫోటో షేర్ చేసిన కాబోయే బాలీవుడ్ హీరోయిన్!

లేట్ నైట్ పార్టీల్లో కలసి హంగామా చేసే షానయా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో చిన్ననాటి ఆర్యన్ ఖాన్ని మనం చూడవచ్చు. అతడితో పాటూ చిన్నారి షానయా కూడా ఉంది. అప్పట్నుంచీ ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తోన్న ఈ ఇద్దరూ ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్సే. అందుకే, ఆర్యన్‌కి బెయిల్ కన్‌ఫర్మ్ కాగానే షానయా తమ చిన్ననాటి ఫోటో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసింది. ఆమె తండ్రి సంజయ్ కపూర్ కూడా ‘జై సిద్ధి వినాయక్’ అంటూ గణనాథుని చిత్రపటాన్ని తన అకౌంట్లో షేర్ చేశాడు.  

ARYAN KHANకు బెయిల్ లభించగానే... తమ చిన్న నాటి ఫోటో షేర్ చేసిన కాబోయే బాలీవుడ్ హీరోయిన్!

బోనీ కపూర్, అనీల్ కపూర్‌కు సోదరుడైన సంజయ్ కపూర్ ఒకప్పుడు తెరపై కనిపించి తన అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే, పెద్ద స్టార్ కాలేకపోయాడు. తరువాత మహీప్ కపూర్‌ని పెళ్లాడి సెటిలైపోయాడు. సంజయ్, మహీప్‌ల గారాల కూతురు 21 ఏళ్ల షానయా. తాజాగా ఆర్యన్ ఖాన్ ఫోటో షేర్ చేసిన ఆమె త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని బీ-టౌన్ టాక్. ఇప్పటికే ఆమె యాక్టింగ్ కోర్స్ కూడా పూర్తి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షానయాకు భారీ ఫాలోయింగే ఉంది... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement