Advertisement

బావ దెబ్బతో మరదలికి తప్పని ట్రోలింగ్...

ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వటం పెద్ద కలకలం రేపింది. అయితే, భర్త మీద కేసు నమోదు కావటంతో శిల్పా శెట్టికి కూడా ఇక్కట్లు తప్పలేదు. కొన్ని వారాల పాటూ ఆమె తన డ్యాన్సింగ్ రియాల్టీ షోకి కూడా దూరంగా ఉండిపోయింది. బుల్లితెరపై జడ్జీగా కనిపించలేక ఇంటిపట్టునే ఉండిపోయింది. అయితే, అదే సమయంలో శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె బాధకి కారణం కూడా రాజ్ కుంద్రానేనట!


 బావ రాజ్ కుంద్రా వ్యవహారం తనకు తలనొప్పిగా మారిందని చెబుతోంది షమితా శెట్టి. ఆమె ముందుగా ఒప్పుకున్న విధంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనాల్సి ఉంది. అదే సమయంలో కుంద్రా అరెస్ట్ వార్త పిడుగులా నెత్తిన పడింది. జనాలు షమితా శెట్టిని కూడా హెవీగా ట్రోల్ చేశారు. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు తీశాడంటూ, ఆయన మరదలు బిగ్ బాస్ హౌజ్‌కు వెళుతోందంటూ... రెండు వార్తల్ని కలగలపి వెక్కిరించారు. 


బావ కేసుతో ఆన్‌లైన్‌లో ట్రోల్ అయిన శిల్పా శెట్టి చెల్లెలు, ఒక దశలో, బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లవద్దని అనుకుందట. కానీ, ప్రస్తుత కరోనా కాలంలో చాలా మంది ఆదాయం లేక ఇళ్లలో మగ్గిపోతున్నారు. తనకు మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి బిగ్ బాస్ నిర్వాహకులు డబ్బులు ఇస్తామంటే ఎందుకు ఊరుకోవాలని అడుగు ముందుకు వేసిందట! ప్రస్తుతం షమితా బిగ్ బాస్ వెబ్ వర్షన్ పూర్తి చేసుకుని టెలివిజన్ వర్షన్‌కు సిద్ధం అవుతోంది. ఇంతకాలంలో ‘వూట్’ ఓటీటీలో ప్రసారమైన రియాల్టీ షో ఇక మీద కలర్స్ ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది...    

Advertisement

Bollywoodమరిన్ని...