‘శక్తిమాన్‌’ అవుదామనుకుని.. ఊచలు లెక్కబెట్టుకుంటున్నాడు!

ABN , First Publish Date - 2022-05-28T23:01:45+05:30 IST

‘శక్తిమాన్’.. 1990లలో టీవీలు చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. ఈ ఇండియన్ సూపర్ హీరో టెలివిజన్ ప్రేక్షకులను

‘శక్తిమాన్‌’ అవుదామనుకుని.. ఊచలు లెక్కబెట్టుకుంటున్నాడు!

నోయిడా: ‘శక్తిమాన్’.. 1990లలో టీవీలు చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. ఈ ఇండియన్ సూపర్ హీరో టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఇక, చిన్నారులైతే అతడికి పెద్ద ఫ్యాన్స్‌గా మారిపోయారు. శక్తిమాన్‌ను మారోమారు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసిన చేసిన ఓ యువకుడు, అతడి ముగ్గురు స్నేహితులు ఇప్పుడు జైలులో తీరిగ్గా ఊచలు లెక్కబెట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను నోయిడా పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.


ఆ వీడియోలో ఓ యువకుడు శక్తిమాన్‌లా స్టంట్స్ చేశాడు. బైక్‌పై పడుకుని దూసుకుపోయాడు. అతడి ఇద్దరి స్నేహితులు దీనిని వీడియో తీశారు. ఆ వీడియోలో ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన యువకుడి పేరు వికాస్. అతడు అలా స్టంట్స్ చేస్తుంటే స్నేహితులైన గౌరవ్, సూరజ్‌లు వీడియో షూట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్తా వైరల్ అయి సెక్టార్-63 పోలీసుల దృష్టిలో పడడంతో వారు వెంటనే రంగంలోకి దిగిపోయారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్టంట్స్‌కు ఉపయోగించిన బైక్‌ను సీజ్ చేశారు. 


సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న 21 ఏళ్ల యువకుడిని ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాలో అజయ్ దేవగణ్‌లా నడుస్తున్న రెండు కార్లపై చెరో కాలు వేసి నిలబడి ప్రమాదకర స్టంట్ చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. 



Updated Date - 2022-05-28T23:01:45+05:30 IST