బంగ్లా టీ20 కెప్టెన్‌గా షకీబల్‌

ABN , First Publish Date - 2022-08-14T08:57:09+05:30 IST

ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ మరోసారి బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

బంగ్లా టీ20 కెప్టెన్‌గా షకీబల్‌

ఢాకా: ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ మరోసారి బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియాకప్‌, న్యూజిలాండ్‌లో జరిగే ముక్కోణపు సిరీస్‌తోపాటు ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి వరల్డ్‌కప్‌నకు సారథిగా షకీబల్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు  శనివారం ప్రకటించింది. దేశానికి ఆడడం కోసం బెట్టింగ్‌ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని వదులుకోవడానికి షకీబల్‌ అంగీకరించినట్టు తెలిపింది. 


ఆసియాకప్‌నకు బంగ్లా జట్టు:

షకీబల్‌ (కెప్టెన్‌), అనముల్‌ హక్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, ఆఫిఫ్‌ హుస్సేన్‌, మొసద్దక్‌ హుస్సేన్‌, మహ్మదుల్లా, మెహ్దీ హసన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, హసన్‌ మహ్మద్‌,  ముస్తాఫిజుర్‌, నసుం అహ్మద్‌, సబ్బీర్‌ రహ్మన్‌, మీర్జా, ఇబాదత్‌ హుస్సేన్‌, పర్వేజ్‌, నూరుల్‌ హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌. 

Updated Date - 2022-08-14T08:57:09+05:30 IST