దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో గ్రూప్1లో ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయిన బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఏస్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ గాయం కారణంగా ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబేదిన్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అతడి గాయం తీవ్రత ఎంత అనేది ఇంకా తెలియరాలేదని, ఈ నెల 19 పాకిస్థాన్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లో షకీబల్ ఆడేది, లేనిది ఫిజియోథెరపిస్ట్ నివేదిక తర్వాతే నిర్ణయిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది.