షకిబ్ అల్ హసన్‌పై 3 మ్యాచ్‌ల నిషేధం.. 5 లక్షల ఫైన్

ABN , First Publish Date - 2021-06-13T02:34:46+05:30 IST

ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ చేసిన రచ్చకు శిక్ష పడింది. అతడిపై క్రమశిక్షణ ..

షకిబ్ అల్ హసన్‌పై 3 మ్యాచ్‌ల నిషేధం.. 5 లక్షల ఫైన్

ఢాకా: ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ చేసిన రచ్చకు శిక్ష పడింది. అతడిపై క్రమశిక్షణ చర్యల కింద మూడు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ శనివారం ప్రకటించింది. అంతేకాకుండా అతడి చర్యను ఐసీసీ లెవెల్ 3 తప్పిదం క్రింద పరిగణించి.. 5 లక్షల బంగ్లాదేశీ టాకాల ఫైన్‌తో పాటు 3 మ్యాచ్‌ల బ్యాన్ కూడా విధించింది. అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో నిషేధాలను షకిబ్ ఎదుర్కొన్నాడు. మైదానంలో దురుసుగా ప్రవర్తించి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.


కాగా..శుక్రవారం ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా శుక్రవారం మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్-అబహానీ లిమిటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. షకీబ్ బౌలింగ్ వేసిన వెంటనే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షకీబల్ వికెట్లను బలంగా తన్ని అంపైర్‌పైకి దూసుకెళ్లాడు. అలాగే ఆ తర్వాతి ఓవర్లో వర్షం పడడంతో 5.5 ఓవర్ల వద్ద  మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించడంపై కూడా షకిబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న వికెట్లను పెకలించి కింద విసిరికొట్టాడు. షకీబల్ చేసిన ఈ పని క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Updated Date - 2021-06-13T02:34:46+05:30 IST