శంభుదేవునికి శకటోత్సవం

ABN , First Publish Date - 2022-01-28T05:16:18+05:30 IST

మండలంలోని దుద్దెడలో కొలువైన శంభుదేవుని జాతర గురువారం శివనామ స్మరణల మధ్య గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం గణపతి పూజ, మండపారదన, కలశపూజ, స్వయంభుదేవునికి, పార్వతీదేవికి విశేష పూజలు, అభిషేకం, అలంకరణ నిర్వహించారు. సాయంత్రం శకటోత్సవం(బండ్లు తిరుగుట)కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.

శంభుదేవునికి శకటోత్సవం
దుద్దెడలోని స్వయంభు శంభుదేవుడి ఆలయం చుట్టూ నిర్వహిస్తున్న బండ్ల ఊరేగింపు

ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవ జాతర


కొండపాక, జనవరి 27: మండలంలోని దుద్దెడలో కొలువైన శంభుదేవుని జాతర గురువారం శివనామ స్మరణల మధ్య గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం గణపతి పూజ, మండపారదన, కలశపూజ, స్వయంభుదేవునికి, పార్వతీదేవికి విశేష పూజలు, అభిషేకం, అలంకరణ నిర్వహించారు. సాయంత్రం శకటోత్సవం(బండ్లు తిరుగుట)కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. శకటోత్సవాన్ని ఆలయ ట్రస్టు చైర్మన్‌ గొల్లపల్లి రామచంద్రమూర్తి ప్రారంభించారు. శనివారం నిర్వహించే శివపార్వతుల కళ్యాణం కోసం ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ గొల్లపల్లి రామచంద్రమూర్తి పేర్కొన్నారు. గురువారం వార్షిక వేడుకల్లో సర్పంచ్‌ అరెపల్లి మహాదేవ్‌గౌడ్‌, స్వయంభు లింగేశ్వర సేవ సమితి సభ్యులు మంచాల శ్రీనివాస్‌, గోనె శ్రీనివాస్‌, పెద్ది కుమార్‌, మంచాల చిన్న శ్రీనివాస్‌, నర్ర దేశాయ్‌ రెడ్డి ,మురళీధర్‌, వడ్లకొండ శ్రీనివాస్‌, అమిరిశెట్టి వెంకటేశం, వెంకటరమణ, పబ్బోజు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:16:18+05:30 IST