Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కేంద్రంలో మోదీ ధరలు పెంచితే.. ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారు: శైలజానాథ్

twitter-iconwatsapp-iconfb-icon
కేంద్రంలో మోదీ ధరలు పెంచితే.. ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారు: శైలజానాథ్

విజయవాడ: బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటంటూ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రజలను దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. నిరసన తెలిపితే అక్రమ కేసులు, దేశద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ప్రధాని మోదీ ధరలు పెంచితే.. ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారన్నారు. మోదీని వైసీపీ నేతలు నిలదీయలేకపోతున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు అమ్ముతాం.. హోదా ఇవ్వమని చెప్పినా ఏమీ చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. ధరల పెంపునకు నిరసనగా గురువారం విజయవాడలో ఆందోళనకు పిలుపిచ్చారు. అలాగే ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. 7న విశాఖలో ఆందోళన కార్యక్రమాలకు శైలజానాథ్ పిలుపిచ్చారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.