ఢిల్లీలాంటి రాజధాని మాట మాయలేనా?

ABN , First Publish Date - 2020-10-24T12:00:04+05:30 IST

అమరావతినిఢిల్లీలాంటి రాజధానిగా చేస్తామంటూ ప్రధాని మోదీ చెప్పింది మాయమాటలేనా అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శించారు

ఢిల్లీలాంటి రాజధాని మాట మాయలేనా?

 ప్రధాని మోదీపై పీసీసీ చీఫ్‌ విమర్శ 


రేణిగుంట, అక్టోబరు 23: అమరావతినిఢిల్లీలాంటి రాజధానిగా చేస్తామంటూ ప్రధాని మోదీ చెప్పింది మాయమాటలేనా అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల కిందట అమరావతి నిర్మాణానికి నీళ్లు, మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను మోదీ మోసం చేశారన్నారు. అమరావతి కోసం బీజేపీ పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి నిజానిజాలు తెలుసుకుని రాజధాని అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెప్పడం శోచనీయన్నారు.


బీజేపీతో కలిసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. అందుకనే పౌరసత్వ సవరణ, వ్యవసాయ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికిందని విమర్శించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. అనంతరం ఆయన విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పీసీపీ కార్యదర్శి రామ్‌భూపాల్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌, చిట్టిబాబు, చిరంజీవి, నరసింహులు ఆయనకు వీడ్కోలు పలికారు. 

Updated Date - 2020-10-24T12:00:04+05:30 IST