రేపు షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2021-12-31T22:11:43+05:30 IST

శనివారం షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్లు మేర ఫ్లైఓవర్ నిర్మించారు.

రేపు షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

హైదరాబాద్: శనివారం షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్లు మేర ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లే వాహనాలకు ఊరట లభించనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లను షేక్‌పేట్ ఫ్లైఓవర్ కవర్ చేసింది. షేక్‌పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణించవచ్చు. 2018లో షేక్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైంది.

Updated Date - 2021-12-31T22:11:43+05:30 IST