షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-02T01:13:43+05:30 IST

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో అతిపొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ రికార్డుకెక్కంది.

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో అతిపొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ రికార్డుకెక్కంది. రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించారు. 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా నిర్మించి టూ వే ట్రాఫిక్ మార్చారు. నాలుగు ప్రధాన జంక్షన్లను షేక్‌పేట్ ఫ్లైఓవర్ కవర్ చేస్తోంది. షేక్‌పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణించవచ్చు. 


ట్రాఫిక్‌ జామ్‌జాటం తగ్గించేందుకు నగర కూడళ్లలో వంతెనలు, ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగం గా 54 కూడళ్లలో వంతెనలు/గ్రేడ్‌ సెపరేటర్లు, 135 కి.మీల మేర ఎలివేటెడ్‌ కారిడార్లు, 166 కి.మీల కారిడార్ల అభివృద్ధి, 348 కి.మీల మేర ప్రధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-01-02T01:13:43+05:30 IST