Abn logo
Oct 25 2020 @ 00:13AM

షారూక్‌ పెద్ద మనసు

Kaakateeya

నటుడిగా తనను ఉన్నత శిఖరాలపైన కూర్చొబెట్టిన ప్రజలకు కష్టకాలంలో సాయంగా  నిలబడ్డారు బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఆయన 2 వేల పీపీఈ కిట్లను అందించారు. తను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘మీర్‌ ఫౌండేషన్‌’ ద్వారా ఈ సాయాన్ని అందించారు. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాఘేల్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘‘పీపీఈ కిట్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న షారూక్‌ వాటిని అందించేందుకు ముందుకొచ్చారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందికి తనవంతు మద్దతుగా నిలిచారు. ఆయనకు ధన్యవాదాలు’’ అని సీఎం ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement