నిందితులకు కరోనా పాజిటివ్.. రెండ్రోజుల పాటు కోర్టు మూసివేత!

ABN , First Publish Date - 2021-01-21T23:00:27+05:30 IST

పలు కేసులో విచారణకు వచ్చిన ముగ్గురు ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓ కోర్టు రెండు రోజుల పాటు మూతపడింది....

నిందితులకు కరోనా పాజిటివ్.. రెండ్రోజుల పాటు కోర్టు మూసివేత!

షాజహాన్పూర్: పలు కేసుల్లో విచారణకు హాజరైన ముగ్గురు ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓ కోర్టు రెండు రోజుల పాటు మూతపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిగోహి, సిద్దౌలీ, కొట్వారీ పోలీస్టేషన్ల పరిధిలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను బుధవారం ఓ మేజిస్టీరియల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఈ ముగ్గురినీ జ్యుడీషియల్ కస్టడీ కింద షాజహాన్పూర్ జైలుకు పంపినట్టు జైలు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం నిందితులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తేలిందన్నారు. దీంతో వెంటనే వారిని చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించామని రాకేశ్ వెల్లడించారు. మరోవైపు మేజిస్టీరియల్ కోర్టును 48 గంటల పాటు మూసివేస్తూ షాజహాన్పూర్ జిల్లా జ్యుడిషియరీ చీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు సెంట్రల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనీష్ త్రివేది వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకిన నిందితులకు కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నామని మెడికల్ కాలేజి ప్రొఫెసర్ డాక్టర్ పూజా పాండే పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T23:00:27+05:30 IST