Jun 24 2021 @ 13:36PM

నాని నన్ను ఏడిపించాడు : షాహిద్ కపూర్

నాని నన్ను ఏడిపించాడు అని చెప్పాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు 'జెర్సీ'కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. మృణాల్ ఠాకూర్ న్‌గా,షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన షాహిద్.. ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. "కబీర్ సింగ్ చేయక ముందే 'జెర్సీ' సినిమా చూశాను. అయితే కాస్త లేట్‌గా లేట్ సక్సెస్ గురించి చెప్పే 'జెర్సీ' కథతో రిలేట్ అయ్యాను. ఇది రిటైర్ అయిన తర్వాత కీర్తిని పొందే ఓ వ్యక్తి కథ" అని షాహిద్ తెలిపాడు. ఈ సందర్భంగా హీరో నాని పై ప్రశంసలు కురిపించాడు. 'నాని ఆ పాత్రలో చాలా బాగా నటించాడు.. సినిమా చూస్తున్నప్పుడు 4-5 సార్లు ఏడిపించాడు'.. షాహిద్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.