శివాజీగా షాహిద్‌ కపూర్‌

ABN , First Publish Date - 2021-02-28T08:45:32+05:30 IST

భారతదేశ చరిత్రలో ఛత్రపతిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం పొందారు శివాజీ మహారాజ్‌. ఆయన జీవిత కథతో త్వరలో బాలీవుడ్‌లో సినిమా రాబోతోంది.

శివాజీగా షాహిద్‌ కపూర్‌

భారతదేశ చరిత్రలో ఛత్రపతిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం పొందారు శివాజీ మహారాజ్‌. ఆయన జీవిత కథతో త్వరలో బాలీవుడ్‌లో సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో శివాజీ పాత్రను హీరో షాహిద్‌ కపూర్‌ పోషిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. ‘కబీర్‌సింగ్‌’ నిర్మాత అశ్విన్‌వర్దే లైకా ప్రొడక్షన్స్‌తో కలసి ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ‘కబీర్‌సింగ్‌’ లాంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ కావడంతో షాహిద్‌కూడా ఈచిత్రంలో నటించేందుకు వెంటనే అంగీకరించారట. ‘పద్మావత్‌ ’ తర్వాత షాహిద్‌కపూర్‌ నటించే చారిత్రక చిత్రం ఇదే.

Updated Date - 2021-02-28T08:45:32+05:30 IST