Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 12 Aug 2022 13:03:40 IST

Brahmastra Video Leaked: రణ్‌బీర్ కపూర్ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్.. వైరల్ అవుతున్న వీడియో

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న మూవీ ‘బ్రహ్మస్త్ర (Brahmastra)’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాక్లెట్ బోయ్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియాభట్ (Alia Bhatt) హీరో హీరోయిన్లుగా నటించారు. అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో నాగార్జున కీలకపాత్రలు పోషించారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల్లో సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటికి వస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇటీవలే ఈ మూవీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) క్యామియో పాత్రలో కనిపించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా ఆయనకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట లీకై హల్‌చల్ చేస్తోంది. అందులో షారుఖ్ ‘వానారాస్త్ర’గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఆ వీడియోలో.. పవర్స్ వచ్చిన షారుఖ్ గాలిలో నిలుచుని ఉండగా.. ఆయన వెనుకగా హనుమంతుడు నిప్పులా వెలుగుతూ కనిపిస్తాడు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో షారుఖ్‌పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో.. ‘ఇది నిజమా.. నేను షాక్‌లో ఉన్నా’ అని ఒకరు.. ‘వానారాస్త్రగా కనిపించిన షారుఖ్ బ్రహ్మస్త్ర స్థాయిని ఇంకా పెంచాడు’ అని మరొకరు.. మరొకరైతే.. ‘లీకైన ఈ వీడియో నిజంగా బంగారం’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. షారుఖ్ ఇప్పటికే ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’లో గెస్ట్‌లో కనిపించారు. అంతేకాకుండా.. ఆయన హీరోగా ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.





Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement