అమెరికా క్రికెట్లో షారుక్‌ పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-12-02T09:08:48+05:30 IST

బాలీవుడ్‌ బాద్‌షా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ అమెరికా క్రికెట్‌ వ్యాపార కార్యకలాపాల్లోకి అడుగుపెట్టాడు

అమెరికా క్రికెట్లో షారుక్‌ పెట్టుబడులు

ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ అమెరికా క్రికెట్‌ వ్యాపార కార్యకలాపాల్లోకి అడుగుపెట్టాడు. ఆ దేశంలో త్వరలో ఆరంభం కాబోయే ఓ భారీ క్రికెట్‌ లీగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా క్రికెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏస్‌) అనే సంస్థతో షారుక్‌ చేతులు కలిపాడు. షారుక్‌తో పాటు కేకేఆర్‌ యజమానుల్లో ఒకరైన జూహీచావ్లా కూడా ఏస్‌ సంస్థతో కలిపి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ‘నైట్‌రైడర్స్‌ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆసియా దేశాల తర్వాత క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే వారి సంఖ్య అమెరికాలో అధికంగా ఉంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో అక్కడ జరిగే క్రికెట్‌ పోటీల్లో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని షారుక్‌ తెలిపాడు. ఇక, ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్‌తో పాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్లకు షారుఖ్‌ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అమెరికాలో ప్రారంభమయ్యే లీగ్‌లో లాస్‌ఏంజెల్స్‌ ఫ్రాంచైజీని షారుక్‌ దక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-12-02T09:08:48+05:30 IST