షాదీఖానా నిర్మాణం చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-25T05:20:18+05:30 IST

షాదీఖానా నిర్మాణం చేపట్టాలి

షాదీఖానా నిర్మాణం చేపట్టాలి
కొడంగల్‌లో ధర్నా చేస్తున్న ఎంఐఎం నాయకులు

  • ఎంఐఎం కొడంగల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్‌ 

కొడంగల్‌, మే 24 : శిథిలావస్థకు చేరిన షాదీఖానా (ఉర్దూ ఘర్‌) నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎంఐఎం కొడంగల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కొడంగల్‌లో తాండూర్‌ రోడ్డులో గల షాదీఖానా ఎదుట ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీఖానా నిర్మాణాన్ని చేపట్టాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ.. అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రొసీడింగ్‌ వచ్చినట్లు ప్రకటించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా షాదీఖానా నిర్మాణాన్ని చేపట్టాలని, లేనిపక్షంలో ఎంఐఎం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు, ధర్నాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో ఎంఐఎం నాయకులు షేక్‌ రుమాన్‌, ఎండీ. రహత్‌, ఎండీ. ముర్తజా, షేక్‌ ఆబీద్‌, ఎండీ. అశ్వాఖ్‌, సయ్యద్‌ ముస్తాఫా, ఎండీ. అజహర్‌, సయ్యద్‌ మహిమూద్‌, ఎండీ. ఆమేర్‌, ఎండీ. ఏజాజ్‌, ఎండీ. నిసార్‌బేగ్‌, ఎండీ. సర్తాజ్‌, ఎండీ. అర్షద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:20:18+05:30 IST