ఫిబ్రవరి 4న శభాష్‌ మిథు

తాప్సీ పన్ను టైటిల్‌ రోల్‌ పోషించిన క్రీడానేపథ్య చిత్రం ‘శభాష్‌ మిథు’. విడుదల తేదీ ఖరారైంది. భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబరు 3న మిథాలీ పుట్టిన రోజు సందర్భంగా ‘శభాష్‌ మిథు’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మైదానంలో తాప్సీ బ్యాట్‌తో ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ జిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో వయకోమ్‌ 18 సంస్థ నిర్మిస్తోంది. 


Advertisement