శభాష్‌ చిరాగ్‌!

ABN , First Publish Date - 2021-03-15T05:30:00+05:30 IST

పెద్ద సంఖ్యను గుణించాల్సి వస్తే ఫోన్‌లో క్యాలిక్యులేటర్‌ ఓపెన్‌ చేస్తాం. కానీ క్యాలిక్యులేటర్‌ ఓపెన్‌ చేసే సమయంలోగా ఆ కుర్రాడు సమాధానం చెబుతాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లాలోని నౌకుడ్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిరాగ్‌ ప్రతిభ ఇది

శభాష్‌ చిరాగ్‌!

పెద్ద సంఖ్యను గుణించాల్సి వస్తే ఫోన్‌లో క్యాలిక్యులేటర్‌ ఓపెన్‌ చేస్తాం. కానీ క్యాలిక్యులేటర్‌ ఓపెన్‌ చేసే సమయంలోగా ఆ కుర్రాడు సమాధానం చెబుతాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లాలోని నౌకుడ్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిరాగ్‌ ప్రతిభ ఇది.

  • ఎంత పెద్ద సంఖ్యనైనా గుణించమంటే సెకన్లలో గుణించి చెబుతాడు. 20 కోట్ల సంఖ్య వరకు అవలీలగా చెప్పేస్తాడు. 40 కోట్ల సంఖ్య వరకు టేబుల్స్‌ క్యాలిక్యులేట్‌ చేయగలడు. 100 కోట్ల వరకు స్క్వేర్‌, స్క్వేర్‌ రూట్‌, క్యూబ్‌, క్యూబ్‌ రూట్‌ చేయగలడు. 
  • అతనిలోని ప్రతిభను నాలుగో తరగతిలోనే పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించారు. అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతున్న చిరాగ్‌ త్వరలోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మనదేశ కీర్తిపతాకాలను ఎగరేస్తానని చెబుతున్నాడు. 
  • చిరాగ్‌కు మ్యాథ్స్‌ కాకుండా క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అతనికి ఇష్టమైన క్రికెటర్‌ ధోనీ. చిరాగ్‌ది చాలా పేద కుటుంబం. తన ప్రతిభతో సొంత ఊరికి కూడా గుర్తింపును తీసుకొస్తానని అంటున్న చిరాగ్‌కు మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా!

Updated Date - 2021-03-15T05:30:00+05:30 IST