ప్రైవేట్ కళాశాలగానే ఎస్‌జీఎస్‌ కళాశాల: ఉదయభాను

ABN , First Publish Date - 2021-12-16T00:44:37+05:30 IST

నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఏకైక ఎయిడెడ్‌ కళాశాల ఎస్జీఎస్‌ కళాశాలను

ప్రైవేట్ కళాశాలగానే ఎస్‌జీఎస్‌ కళాశాల: ఉదయభాను

జగ్గయ్యపేట: నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఏకైక ఎయిడెడ్‌ కళాశాల ఎస్జీఎస్‌ కళాశాలను ప్రైవేటు కళాశాలగానే నడుపుతామని  ఎమ్మెల్యే, కాలేజీ చైర్మన్ సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. ఎస్‌జీఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విధానం నచ్చకపోతే కాలేజీ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ కళాశాలగా ఉన్నా ప్రభుత్వ నిబంధనలు వర్తింప చేస్తామని విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తెలిపారు. 


 నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఏకైక ఎయిడెడ్‌ కళాశాల ఎస్జీఎస్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని ఎస్జీఎస్‌ కళాశాల విద్యార్థులు రిలే దీక్షలు చేసిన సంగతి తెలిసిందే.  16 మంది విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహారంతో దీక్షలు చేశారు. ప్రభుత్వ పరిధిలో కళాశాల లేకుంటే పేద విద్యార్థులు చదుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. 


పొరుగున ఉన్న నందిగామలో కేవీఆర్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించేందుకు అక్కడ కళాశాల యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-12-16T00:44:37+05:30 IST