Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్జీఎస్‌ను ఎయిడెడ్‌ కళాశాలగా కొనసాగించాలి

జగ్గయ్యపేట, డిసెంబరు 3: ఎంతో చరిత్ర ఉన్న ఎస్జీఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల గేటు ఎదుట విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా లేకపోతే ప్రైవేట్‌ విద్యాసంస్థలఆధిపత్యాన్ని విద్యార్థులు భరించలేక చదవులు మానుకోవాల్సి వస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు అన్నారు. పొరుగున ఉన్న నందిగామలో కేవీఆర్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించేందుకు అక్కడ కళాశాల యాజమాన్యం నిర్ణయించిందన్నారు. సుదీర్ఘంగా ధర్నా కొనసాగగా, కళాశాల తరఫున ఏవో కె.సత్యనారాయణ పోలీసుల సమక్షంలో చర్చలు జరిపారు. ఉదయభాను రాగానే చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


Advertisement
Advertisement